మాలపల్లి తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం : గుంటూరు శేషేంద్ర శర్మ

classic Classic list List threaded Threaded
1 message Options
Saatyaki s/o Seshendra Saatyaki s/o Seshendra
Reply | Threaded
Open this post in threaded view
|

మాలపల్లి తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం : గుంటూరు శేషేంద్ర శర్మ


మాలపల్లి తెలుగు విప్లవ సాహిత్యంలో

వచ్చిన ప్రథమ మహాకావ్యం

------

గుంటూరు శేషేంద్ర శర్మ

Visionary Poet of the Millennium

http://seshendrasharma.weebly.com/

* వాల్మీకి, వ్యాసులు ప్రాచీన సాహిత్యానికి ఎలాగో అలా గురజాడ, ఉన్నవలు విప్లవ సాహిత్యానికి


* మాలపల్లి తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం


* అక్టోబరు విప్లవం అనే చరిత్రాత్మక సంఘటనకు తెలుగులో


   1922 లో వినిపించిన తొలి ప్రతిధ్వని మాలపల్లి!


*1922 నుంచి తెలుగు సాహిత్యంలో రెండు శాఖలున్నాయి.


ఒకటి 1922తో ప్రారంభించే విప్లవ శాఖ. రెండు 1942 తో ప్రారంభించే భావకవిత్వ శాఖ


* అభినవ కవిత్వం అనే పేరులో నుంచి అభినవ అనే పదం తీనేసి ఎట్లా భావకవిత్వం అని మార్చారో అట్లాగే అభ్యుదయ కవిత్వం అనే పేరులో నుంచి అభ్యుదయం తీనేసి విప్లవ కవిత్వం అని సవరించాలి

___

తెలుగులో విప్లవ కవిత్వపు ఉప్పెన తొలుత ఈ శతాబ్దపు ఏ ఇరవయ్‌ ముప్పయ్యి లో ఉద్భవించిందో ఆ థాబ్దాల్లో తెలుగు ప్రజల సామాజిక సాహిత్య జీవన మిశ్రమాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ రోజు విస్మయావహంగా వుంటుంది. వాల్మీకి, వ్యాసులు ప్రాచీన సాహిత్యానికి ఎలాగో అలా గురజాడ, ఉన్నవలు విప్లవ సాహిత్యానికి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి మాలపల్లి తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహాకావ్యం. శ్రామిక లోక ఐకమత్యానికి కార్ల్‌ మార్క్సు ఆధునిక విప్లవ సిద్ధాంతానికి ప్రాణాంకురమైన కాన్సెప్ట్‌ ఆఫ్‌ ది సర్‌ప్లస్‌ వాల్యు ఆఫ్‌ లేబర్‌ కు కళాత్మక మహోత్సవం జరుపుతూ 1922 లో వచ్చిన నవల మాలపల్లి! రష్యాలో 1917లో జరిగిన అక్టోబరు విప్లవం అనే చరిత్రాత్మక సంఘటనకు తెలుగులో 1922 లో వినిపించిన తొలి ప్రతిధ్వని మాలపల్లి!

''కూలికి విలువ కలదని మీరు గుట్టు తెలుసుకోండి, కూలికి తగినా విలువ పుచ్చుకుని కూలికి మరి పోండి..... పనివాళ్ళందరు ఏకము అయితే ప్రపంచ మే మీది! శ్రేణులు గట్టి సమ్మెకట్టితే చెల్లును మీ మాట'' (మాలపల్లి) అనే మాలపల్లిలో పాటపంక్తులు అక్టోబరు విప్లవం జరిగిన అయిదేళ్ళకే దాస్‌ క్యాపిటల్ని కమ్యూనిస్టు మ్యానిఫెస్టోని తెలుగు ప్రజల గుండెల్లో నిండేలా గర్జించాయి. విప్లవ సాహిత్యంలో మాలపల్లి మహాకావ్య శిఖరస్థానాన్ని దృక్కేంద్రం చేయని విమర్శకుడు తెలుగు సాహిత్యంలో విప్లవ యుగస్వరూపాన్ని అస్తవ్యస్తం చేసినవాడవుతాడు.

సాహిత్యపు పునాదులే మారిపోయి ఒక నూతన సృజనాత్మక రచనా శిల్పం చేస్తున్న మహోదయంలో సాహిత్య ప్రక్రియా భేదాలు ఎంత కనిష్టమయి పోతాయంటే ద్రష్టృత్వమున్న విమర్శకుడు వాటిని నిర్లక్ష్యం చేసి ఆ యుగపు విశ్వరూపాన్ని దర్శించి నమస్కరిస్తాడు. ఆ విశ్వరూపాన్ని ఆత్మీకరించుకుని అంచనా వేస్తాడు. కొండంత ఎత్తుతో మాలపల్లి మన సాహిత్యంలో నుల్చోవుండినా మహాప్రస్థానం మీదనే జిహ్వల మూకలు తమ ప్రశంసా వర్షాలన్నింటిని కురిపించడం సాహిత్యస్పృహ వున్న దృశ్యాన్ని చూపించదు. విప్లవ చేతనలో కళాత్మక గుణంలో మాలపల్లి మహాప్రస్థానం కంటె ఎన్నో మణుగులు బరువైన రచన. మాలపల్లి, మహాప్రస్థానము రెండు విభిన్న సాహిత్య ప్రక్రియలకు చెందిన వనే తృణప్రాయమైన కారణంచేత మహాప్రస్థానాన్ని తెలుగు సాహిత్య ప్రపంచ శిఖరంమీద పెట్టడం ఆవాస్తవిక, కృత్రిమ, అజ్ఞాన ప్రేరిత కార్యమవుతుంది. కాదంబరిని మహాకావ్యంగా కొలిచే భారతీయ లాక్షణిక మానదండాలు మాలపల్లిని కూడా అదేవిధంగా కొలుస్తాయి.

1934లో ఆంధ్రదేశంలో కాంగ్రెసు సోషలిస్టు పార్టీ జన్మించడం, 1935లో       శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు కార్యదర్శిగా కాకినాడలో అది సమావేశం అవడం, 1939లో కమ్యూనిస్టు పార్టీగా పేరు మార్చుకోవడం. ఇవన్నీ ఆనాటి బ్రిటిషు ప్రభుత్వ భయానక దమనకాండ మూలంగా, రహస్యంగా జరపబడుతూ వుండడం అనే విలువైన సత్యాన్ని మన సాహిత్య అంచనాల్లోకి తీసుకోకపోతే విమర్శకు అవాస్తవికతా దోషం పడుతుంది. తెలుగు విప్లవకారులు విశాఖపట్నం జిల్లా ఆముదాలవలస చిట్టివలస జనపనార మిల్లులో పనిచేసే కార్మికుల్నీ గోదావరీ మండలం పంచదార మిల్లులో పనిచేస్తున్న కార్మికుల్నీ అన్య జిల్లాల్లో వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే కర్షకుల్ని సంఘటితం చేస్తూ శ్రామిక చైతన్యం ఉదయింపజేస్తూ తొలి పాఠాలు నేర్చుకుంటున్న బాల్య కాలం అది.

అలాంటి విప్లవ కార్యక్రమాల్లో నిమగ్నులై పల్లెల్లో పట్నాల్లో శ్రామికుల సమ్మెల కోసం, వూరేగింపుల కోసం రాయబడ్డాయి. పెండ్యాల లోకనాథం, బాలాంత్రపు నళినీకాంతారావు, తుమ్మల వెంకట్రామయ్య చౌదరి, పాలకొండ వీరభద్రయ్య ప్రభృతుల నిప్పులుమిసే పాటలు -

''కూలీలందరు యేకమైతే కూటికి తరుగేమిరా....

సమ్మెలోనే సొగసు వున్నది సూటిగా యోచించరా

సమ్మె చేస్తే కూలీ ఎక్కువ చక్కగా మనకొచ్చురా'' (పెండ్యాల)

''ఆకలిమంటచే మలమలమాడే ఆనాధులందరు లేవండోయ్‌'' (బాలాంత్రపు)

''ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా'' (తుమ్మల)

ఆ పాటలన్నీ తర్వాత 1935లో ప్రభ అనే సంచికలో ముద్రితమయ్యాయి. ఇక్కడ ఒక్కమాట. జయభేరి, అవతారం, మహాప్రస్థానం అనే శ్రీశ్రీ గేయాల తారీఖు 1934 గా చెప్పబడడం పై పరిస్థితుల దృష్ట్యా నిర్దుష్టంగా కనిపించదు. దీనిమీద మరింత పరిశోధన కావాలనిపిస్తుంది. కాని, శ్రీశ్రీ విప్లవ గేయాలు ఆనాటి విప్లవ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాయి.

పెండ్యాల, తుమ్మల, బాలాంత్రపు, పోలకొండ శ్రామిక ఉద్యమాల్లో కలిసిపోయి పాటలు రాస్తే, నారాయణబాబు, శ్రీశ్రీ ప్రభృతులు విశ్వవిద్యాలయాల్లో పట్నవాస రంగస్థలాలో నుల్చుని తమ విప్లవ రచనలు చేశారు. కానీ ఈ యావత్తు భిన్న భిన్న శక్తుల పోరాటాలు కలిసి 1943 లో అభ్యుదయ రచయితల సంఘం జన్మించడానికి కారణం అయ్యాయి. అయితే విప్లవ సాహిత్య మూలస్తంభాలైన రచనలు అప్పటికే వచ్చేశాయి. ఈ మహా విప్లవ రచనా యుగానికి అభ్యుదయ రచయితల సంఘం అని నామకరణం చెయ్యడం తుఫానుని తుప్పర అన్నట్లుగా వుంది. బహుశా ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వ భీతిచే రహస్య ఉద్యమంగా వుండవలసిన కారణంగా, అనువైన విప్లవేతరుల్ని కూడా కలుపుకుని ఒక సంఘటిత సంఘమై అందరికీ సమ్మతమైన పేరు పెట్టుకున్నారు. కానీ ఆ ఉద్యమ మూలశక్తి పచ్చి విప్లవమే. ఆ రచనల పదార్థం కూడా విప్లవమే. కనుక ఈనాడు సాహిత్య పునర్మూల్యాంకన చేసే సందర్భంలో అభ్యుదయ అనే పదం తొలగించి ఆనాటినుంచీ ఈనాటి వరకూ ధారాప్రవాహంగా వస్తూ ఉన్న వర్తమాన విప్లవ తెలుగు కవిత్వానికి, తద్‌ యుగానికి విప్లవ పదం వర్తింప జేయబడాలి.

విప్లవ కవిత్వంలో ప్రథమ తరం గడిచిపోయింది. రెండోతరం వాళ్ళకు ఈ సంఘటనలు తెలీవు. ఈ మెలికెలు తెలీవు. సాహిత్యం ఎప్పుడూ తరతరానికి నిరంతరంగా మూల్యాంకన చేయబడుతూ వుండాలి. టి. ఎస్‌. ఎలియట్‌ అంటాడు ''From time to time, every hundred years or so, it is desirable that some critic shall appear to review the past of our literature and set the poets and the poems in a new order. This task is not one of revolution but of readjustment", (P. 108, Faber & Faber Edition, 1933, ''The use of poetry and the use of criticism".  ఈ పని ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఒక క్రమ పద్ధతిలో చెయ్యబడాలి. రాగద్వేషాల కందకాలైన రాజకీయ రచయితల బారికి అప్పగించబడకూడదు. కనుక 1922 నుంచి తెలుగు సాహిత్యంలో రెండు శాఖలున్నాయి. ఒకటి 1922తో ప్రారంభించే విప్లవ శాఖ. రెండు 1942 తో ప్రారంభించే భావకవిత్వ శాఖ. విప్లవ కావ్యశాఖే తెలుగులో మొదట ప్రారంభం కావడం ఒక విచిత్ర సత్యం !

ఒక వైపు 1934 లో కమ్యూనిస్టు పార్టీ పిండోత్పత్తి, మరోవైపు 1922 విప్లవ సాహిత్యజన్మ అనే చరిత్ర కాంతిలో పరిశీలిస్తే అభినవ కవిత్వం అనే పేరులో నుంచి అభినవ అనే పదం తీనేసి ఎట్లా భావకవిత్వం అని మార్చారో అట్లాగే అభ్యుదయ కవిత్వం అనే పేరులో నుంచి అభ్యుదయం తీనేసి విప్లవ కవిత్వం అని సవరించాలి. కనుక అప్పట్నించీ ఇప్పటివరకూ తెలుగు కవిత్వంలో వచ్చిన అభ్యుదయ కవిత్వం విప్లవకవిత్వంగా సాహిత్య విమర్శలో నామధేయం మార్చబడాలి. ఇదంతా ఆద్యంతమూ విప్లవ కవిత్వయుగమే)

గుంటూరు శేషేంద్ర శర్మ

Visionary Poet of the Millennium

http://seshendrasharma.weebly.com/

 

                                                                                     -'వజ్రాయుధపాణి' నుంచి :

                                                                                      ఆంధ్రప్రభ  దినపత్రిక   18.11.1984

                                                     

                                                       ============

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా

గుంటూరు శేషేంద్ర శర్మ


Visionary Poet of the Millennium


                                                  http://seshendrasharma.weebly.com/


జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి


సుబ్రహ్మణ్య శర్మ

తల్లి


అమ్మాయమ్మ

భార్య /

జానకి

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)



                         కవి : విమర్శకుడు

ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే    

ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….

..... గుంటూరు శేషేంద్ర శర్మ   కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా

       వింధ్య పర్వతం లాంటి వారు .
                                                                                            – ఆంధ్రప్రభ సచిత్ర  వారపత్రిక,
                                                                                                                          (21 ఆగస్టు, 2000)



 

* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
                                                                                 

                                                                            – యువ నుంచి యువ దాకా

                                                                                     (కవితా సంకలనం)
                                                                      అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------

అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర

“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975)

 ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది.

అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో

 కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు.

విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు.

ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి

 నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు.

 పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ

సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు.

 కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో

మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”

ఆచార్య పేర్వారం జగన్నాథం

సంపాదకుడు

అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,

(ప్రచురణ 1987)

మాజీ వైస్ ఛాన్సలర్,

తెలుగు యూనివర్సిటీ)

Visionary Poet of the Millennium

seshendrasharma.weebly.com